ఈ ఏడాది కూడా ఎండలు మండుతాయి..

–  ‘జాగ్రత్త’ అంటు వాతావరణ శాఖహెచ్చరిక
Date:02/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు;
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతాయని వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ మూడు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవనాలు సరైన సమయంలో వస్తాయని చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ అని పేర్కొంది. ఉత్తరభారత దేశంలో ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతాయని చెప్పింది. 2017ను అత్యంత వేడి సంవత్సరంగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. అయితే 2017 ఎండలతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తక్కువగా ఉంటాయని జాతీయ వాతవరణ శాఖ వెల్లడించింది.
Tags:This year also will be sunny.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *