This year we will complete the project of Srirangasagar

ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతాం

Date:04/06/2019

జగిత్యాల ముచ్చట్లు :

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతాం
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి అత్యంత కీలకమైనది.
రాంపూర్ పంపు హౌస్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంప్

హౌస్ పనులను మంగళవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిశీలించారు.పనుల పురోగతి అధికారులతో సమీక్షించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి అత్యంత కీలకమైన

రాంపూర్ పంపు హౌస్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఏడాది జూలై నుండే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నందున

అటు మిడ్ మానేర్, ఇటు ఎస్సారెస్పీకి నీటి పంపింగ్  జరగాలన్నారు .నెల రోజుల్లో రాంపూర్ పంప్ హౌజ్ లోని 8 పంపుల్లో 5 పంపులను సిద్ధం చేయాలని ,ఆగస్టు నాటికి మిగిలిన 3 పంపులను

సిద్ధం చేయాలన్నారు. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లను కూడా చూసుకోవాలన్నారు. గోదావరిలో అక్టోబర్, నవంబర్ నెలల వరకు కూడా నీటి ప్రభావం ఉంటుంది. కాబట్టి  ఆసమయం

వరకు ఎస్సారెస్పీ నీటి పంపింగ్ జరుగుతూనే ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీ ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాది నుండే నీరు అందించడం లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి

కోరారు. ఎండలు తగ్గినందున ఇప్పుడు ఉన్న వారి కంటే ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకుని రేయింబవళ్ళు పని చేసి  లక్ష్యం సాధించాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు. రైతులకు సాగునీరు

అందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని.కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు -రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల

నిర్వహిస్తున్నదని .వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని. దాదాపు 80 శాతం జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు ఇది. ఒకసారి ప్రాజెక్టు పూర్తయితే

తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు .అందుకే ప్రభుత్వం ఎక్కడ నిధుల కొరత లేకుండా, భూసేకరణ సమస్య లేకుండా విధాన నిర్ణయాల్లో జాప్యం జరగకుండా పటిష్టమైన చర్యలు

తీసుకున్నది. దానికి ఫలితంగానే ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదన్నారు. వచ్చేనెల నుండే నీటి పంపింగ్ ప్రారంభించాల్సి ఉన్నందున అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు

సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో గ్రహించి ,అధికారులు, వర్క్ ఏజెన్సీలు పనిచేయాలని ,ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో

దానిని నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు .అనంతరం పంపింగ్ హౌజ్ పనులు చేయుచున్న చైనా ప్రతినిధులతో ముఖ్యమంత్రి నేరుగా

మాట్లాడారు .పంపు హౌజ్ పనులపై వారానికి రెండుసార్లు సమీక్షించాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో  రోడ్లు భవనాల శాఖ

మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ఎంపీ జె. సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ ,ఐ డి సి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి,  నీటిపారుదల శాఖ

ఏజెన్సీ మురళీధర్ రావు ,సలహాదారు పెంటా రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ ,రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

మెరుగయిన వైద్య సేవలు అందించాలి

Tags:This year we will complete the project of Srirangasagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *