దళితులపై దాడి చేసినవారిని శిక్షించాలి

Date:28/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

రాజన్న   సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీ పేటలో దసరా పండుగ నాడు విగ్రహాల ఏర్పాటు లో వచ్చిన వివాదంలో ఒక వర్గం వారు రాళ్లు కర్రలతో దళితులు, మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటాన్ని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేష్ తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన గుండాలపై  పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామోజీ పేట గ్రామం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళితులు, శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరోవర్గం ప్రయత్నించగా ఈ వివాదం దసరా రోజున ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందన్నారు.  ఇది అవకాశంగా తీసుకొని కొంతమంది గుండాలు దళితులపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా వారి ని చితకబాది, వారి ఆస్తులను, బైకులను ధ్వంసం చేయడం జరిగింది.దేశంలో రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్ పాలనలో దళితులపైన, మహిళలపైన నిత్యం దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులకు  వ్యతిరేకంగా ప్రజాతంత్ర శక్తులు వామపక్ష ప్రజా సంఘాలు ఉద్యమాలు ఉధృతం చేయాలని కోరారు.

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

Tags: Those who attacked Dalits should be punished

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *