మహేందర్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి-పురందేశ్వరి
కొవ్వూరు ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేంద్ర కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శనివారం పరామర్శించారు. పురందేశ్వరి మాట్లాడుతూ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ వేసి నిందితుల ను వెంటనే శిక్షించాలని.జాతీయ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేస్తామని హోం మంత్రి తానేటి వనిత అనుచరుడికే ఇలా జరిగితే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ సామాజికయాత్రలు చేస్తున్నారు.దళితుడైన మహేందర్ కు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందని పురందేశ్వరి ఆరోపించారు.
Tags; Those who attacked Mahender should be punished – Purandeshwari

