మంచికి తోడ్పడే వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారు

-ఉదాహరణ ఉచిత ఐసోలేషన్ సెంటరే – విఠపు
-మంగళం లో ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించిన శాసనమండలి ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం

 

మంగళం ముచ్చట్లు:

 

నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని విపత్కర పరిస్థితుల్లోకి కరోనా మహమ్మారి నెట్టబడింది. ఈ పరిస్థితుల్లో సాటి మనిషికి సాయపడాలని మంచి సంకల్పం, ఆ సంకల్పానికి తోడ్పాటును అందించాలనే మంచి గుణం ఇంకా సమాజంలో ఉందని శాసన మండలి ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం మంగళం పరిధిలోని రణధీర పురం పంచాయతీలో కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత ఐసోలేషన్ సెంటర్ ను ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితో కలిసి విఠపు సందర్శించారు. ఈ సందర్భంగా కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కన్వీనర్ మల్లారపు నాగార్జున కరోనా బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఐసోలేషన్ సెంటర్ నిర్వహణ, సేవలను విఠపు బాలసుబ్రహ్మణ్యంకు వివరించారు. ఊహించని విధంగా ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు దాతల సహకారం అందించారన్నారు. ముఖ్యంగా ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు ఐసోలేషన్ సెంటర్ లో ఉన్న కరోనా బాధితులకు విశిష్ట సేవలను అందించారని నాగార్జున వివరించారు. ఇప్పటివరకు 19 మంది కరోనా బాధితులు ఈ ఉచిత ఐసోలేషన్ సెంటర్ లో సేవలు అందుకుని పూర్తి ఆరోగ్యంగా ఇళ్లకు చేరారన్నారు. ఈ సందర్భంగా విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంక్షోభం వచ్చినప్పుడు సమాజం దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుందన్నారు.

 

 

అలానే కరోనా బాధితుల సహాయార్థం వారి ఆరోగ్య పరిరక్షణకు ఉచిత ఐసోలేషన్ సెంటర్ లు చాలా దోహదపడ్డాయన్నారు. అనంతరం కరోనా బాధితులను విఠపు బాలసుబ్రమణ్యం ,MLC యండపల్లి శ్రీనివాసులు రెడ్డి  పలకరించారు. వీరితో బాటు రమాదేవి హాస్పిటల్ అధినేత డా”శశిధర్ రెడ్డి,డా”కిషోర్ పేషంట్లకు అందిస్తున్న సేవలను వివరించారు.ఈ సందర్భంగా నర్సింగ్ సేవలు అందిస్తున్న విజయమ్మను, వాలంటీర్ సేవలు అందిస్తున్న SFI యూనివర్సిటీ విద్యార్థుల్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్సులు ముత్యాలరెడ్డి ,GV రమణ నాయకులు బిర్లానాయుడు ,నిర్మల ,పద్మ,నాగరాజ,కొరటాల ట్రస్ట్ నాయకులు రెడ్డెప్ప,షామీర్ బాష గార్లు సురేష్, పద్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, హేమంత్, అక్బర్, సైదులు, శ్రీధర్, ప్రసన్న మహేష్ ,BTR కాలనీ నాయకులు శ్రీనివాసులు ,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Those who contribute to the good are still in the community

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *