కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకులు

తిరుపతి అర్బన్  ముచ్చట్లు:

 

కమ్మపల్లి ఆది ఆంధ్ర వాడలో ఈ నెల 16వ తేదీ కర్మ క్రియలు కు హాజరైన తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి కి చెందిన దళితులైన గోపి పై కొంతమంది అగ్ర కులస్తులు కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిని అరెస్టు చేసి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పి. గోపి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ గోపి అనే దళితుడు కమ్మ పల్లిలో ఒక కర్మ క్రియలకు హాజరై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో కొంతమంది అగ్ర కులస్తులు అతను ఆపి హారం కొడుతున్నాడని సాగుతో గొడవకు దిగారు. దీనిని ప్రశ్నించినందుకు అతని కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారు అన్నారు. విషయం తెలుసుకున్న ఆది ఆంధ్ర వాడ గ్రామస్తులు గోపి పై దాడిని ప్రశ్నించినందుకు అగ్ర కులస్తులు వారిపై దాడికి దిగి గాయపరిచారని తెలిపారు. ఈ దాడిలో రామచంద్రయ్య, యశ్వంత్, యువ సాయి, దినేష్, జగదీష్ తదితరులు గాయపడ్డారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులుకు మద్దతు పలుకుతూ బాధితులు పైనే కేసు బనాయించడం శోచనీయమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి దళితులపై దాడి చేసిన కిషోర్, చరణ్, అశోక్, నరసింహులు, మునిస్వామి, నాగేంద్ర, చంద్ర, సుబ్రహ్మణ్యం తదితరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రామచంద్రపురం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నాగార్జున మాదిగ, తిరుపతి ఎమ్మార్పీఎస్ నాయకులు మునీంద్ర మాదిగ, శంకరమ్మ బాధితులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Those who slander and attack in the name of caste should be arrested: MMRPS leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *