నేర చరిత్ర కలిగిన వారు సత్ప్రవర్తనతో ఉండాలి- డిఎస్పీ ప్రసాద్ రెడ్డి

ములకళచెరువు ముచ్చట్లు:

నేర చరిత్ర కలిగిన వారంతా సత్ప్రవర్తనతో ఉండాలని మద నపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సూచించారు. మొలకలచెరువు ట్రైనీ డీఎస్పీ ప్రశాంత్, సీఐ మధు, ఎస్ఐ తిప్పే స్వామి మంగళవారం మండలంలోని పాత నేరస్తులు, రౌడీలు, నేర చరిత్ర కలిగిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఎవరు గానీ అల్లర్లు, గొడవలు చేయవద్దని హెచ్చ రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పోలీసుల దృష్టికి ఫిర్యాదులు వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. నేర చరిత్ర కలిగిన వారు ఎలా నడుచుకోవాలో కౌన్సెలింగ్ నిర్వహించి ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నజీర్, హెడ్ కానిస్టేబుల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Those with criminal history should be of good behaviour- DSP Prasad Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *