గుప్తనిధుల కోసం దేవాలయంలో బాంబు పేల్చిన దుండగులు

Thousands of bomb explosions in the temple for Guptanidhi

Thousands of bomb explosions in the temple for Guptanidhi

Date:16/09/2018

మహబూబ్‌నగర్ ముచ్చట్లు:

గుప్త నిధుల కోసం దేవాలయంలో ఏకంగా బాంబు పేల్చిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. నవాబ్‌పేట మండలం మరికల్ గ్రామ సమీపంలో కోటచింతల బసవన్న దేవాలయం ఉంది. అయితే… ఇది ఎప్పుడో పురాతన దేవాలయం కావడంతో కొందరి కన్ను దీనిపై పడింది.

 

దేవాలయంలోని బసవేశ్వరుని విగ్రహం కింద గుప్తనిధులు ఉంటాయన్న అనుమానంతో తవ్వరాలు జరిపినప్పటికీ విగ్రహం కదలక పోవడంతో ఏకంగా ఓ బాంబును తీసుకొచ్చి పేల్చారు. ఈ విషయాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గమనించి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా… పోలీసులు దేవాలయానికి చేరుకుని బాంబు పేల్చిన ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మునిసిపాలిటీలో నకిలీ రశీదులు

Tags:Thousands of bomb explosions in the temple for Guptanidhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *