Women lokam salam for the police

పోలీసులకు మహిళా లోకం సలాం

Date:06/12/2019

విశాఖపట్నం ముచ్చట్లు:

వేలాది గొంతుల నినాదాలు ఫలించాయి.నినదించిన మహిళ లోకం ఈ ఎన్ కౌంటర్ పరిణామంతో హర్షించింది.అప్పుడు నిర్భయ .. ఎప్పుడు దిశ రేపు మరో మహిళ కామాంధుల చేతిలో బలైపోవాల్సిందేన అంటూ ఏకతాటిపైకి వచ్చిన మహిళ సంఘాలు దిశపై జరిగిన దాడిని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి.అందరూ నిందితులకు మరణ శిక్ష పడుతుందని భావిస్తూ తరుణంలో కామాంధులు … పోలీసుల తూటాలు ముందు మట్టుబడడం యావత్తు దేశాన్ని గర్వించేలా చేసింది.జయహో పోలీస్ అంటూ ఖాకీల గుండె నిర్భరానికి మహిళా లోకం సలాం చేసింది. పోలీసులకు మస్కా కొట్టి చక్కెద్దామనుకున్న కేటుగాళ్లకు తగిన శాస్తి జరిగింది.అర్ధరాత్రి సమయంలో రహస్య ప్రాంతం నుంచి తప్పించుకుందామకునే వారి ప్లాన్ బెడిసి కోట్టడంతో కధం అడ్డం తిరిగింది.పోలీసుల తూటాలకు బలైపోవడంతో యావత్తు దేశ పోలీసుల తెగువపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.దిశ నిందితులపై జరిగిన ఎన్ కౌంటర్ ఉదాంతాన్ని హర్షిస్తూ విశాఖలో విధ్యార్ధులు భారీ ర్యాలీ చేపట్టారు.విశాఖ జీవిఎంసీ వద్ద జరిగిన ర్యాలీలో బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు,ఎమ్మెల్సీ మాదవ్ పాల్గోన్నారు.మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే దాడులు తగ్గుముఖం పడతాయని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.తెలంగాణా ప్రభుత్వానికి దన్యవాదులు తెలిపిన విష్ణుకుమార్ రాజు … నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

 

 

 

 

 

 

నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించిన పోలీసుల చర్యలను సమర్ధిస్తూ విశాఖలో సంబరాలు జరిగాయి. బాణా సంచాకాలుస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని విశాఖలో ప్రముఖులు స్వాగతించారు.విశాఖ సీతమ్మధార సమీపంలో వైద్య నిపుణులు కూటికుప్పల సూర్యారావు ఆద్వర్యంలో సంబరాలు జరిగాయి.ఎవరైనా మహిళలపై అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్ష,అవరసమైతే ఎన్ కౌంటర్ కూడా తప్పదనే సూచనలు ఈ పరిణామం ద్వారా అందించారని అన్నారు.
వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిన మహిళల ఉద్యమాలకు ఈ ఎన్ కౌంటర్ మంచి విజయాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక మీదట మహిళలపై అకృత్యాలకు తెగబడితే శిక్షణ తప్పదనే భావన తీసుకొస్తే కచ్చితంగా మహిళలకు నేటి సమాజంలో భద్రత లభిస్తందనే భరోసా లభిస్తుంది.మరి ఇప్పటికైనా వీరిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.

 

పదమూడు గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత

 

Tags:Women lokam salam for the police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *