ముక్కోణపు పోటీతో ముప్పులే

 Date:15/08/2018
విజయవాడ ముచ్చట్లు:
వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ రసవత్తరంగా జరగబోతుంది. బాబు, జగన్‌తో పాటు పవన్ రావడంతో ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు పలువురు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అందులో మెగా ఫ్యామిలీ ఒక పేరు బాగా వినిపిస్తుంది. ఆయన ఒక కానీస్టెన్సీ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇప్పుడు ఇదే న్యూస్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పడు పెద్దగా ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపాడు పవన్. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యేక హోదా టైంలో బిజేపీకి ఎగేనెస్ట్‌గా మారిన పవన్..టీడీపీతో మాత్రం సఖ్యతగా ఉండే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మెదట్లో అడపా దడపా సభలు పెట్టి బిజేపీని తిట్టిన పవన్ ఆ తర్వాతి కాలంలో టీడీపీని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు.
అఙ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన జనసేనాని పూర్తిగా పాలిటిక్స్‌పై కాన్స్‌న్‌ట్రేట్ చేశాడు. వరస సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు నేరుగా వెళ్లి ఆయా ప్రాంతాల్లో పర్యటించాడు.ఒక పక్క పార్టీకి లీడర్స్‌ని జిల్లాల వారీగా రిక్రూట్ చేసుకుంటూ..ఉత్తరాంధ్రలో వరస పర్యటనలు చేస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాడు. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా మైలేజ్ బాగా పెరిగింది. నాయకులను కూడా ఆచితూచి చేర్చుకుంటున్నాడు పవన్. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరేందుకు పలువురు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారట. తూర్పూగోదావరి జిల్లా కాకినాడ నుంచి పోటి చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇక్కడ సొంత సామాజిక వర్గం అధికంగా ఉండటంతో పాటు పవన్‌కి కూడా మంచి ఫ్యాన్ భేస్ ఉంది. కాకినాడపై స్పెషల్ పోకస్ పెట్టిన పవన్ అక్కడ చేరికలను కూడా బాగా ప్రోత్పహిస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి ముత్తా గోపాలక్రిష్ణ చేరడంతో పార్టీకి కూడా కొత్త బలం వచ్చిందని టాక్ నడుస్తుంది.బాగా పట్టున్న జిల్లా కావడం…అందులోనూ జనసేనాని ప్రస్తుతం టూర్‌లో ఆ ఎరియా నుండి సానుకూల పవనాలు వీయడంతో నాగబాబు అడుగులు అటు వైపు వెళ్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
డైరక్ట్‌ గా సపోర్ట్ చేయకపోయినా కూడా పలుమార్లు పవన్‌కు నైతికంగా మద్దతుగా నిలిచాడు నాగబాబు. ఇటీవల కాలంలో పవన్‌పై విమర్శలు చేసినవారికి తనదైన స్టైల్‌లో కౌంటర్ కూడా ఇచ్చాడు మెగా బ్రదర్. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఈ సారి కాకినాడ బరిలో ఉంటారని పొలిటికల్ వర్గాల బోగట్టా. అయితే ఇదే విషయానికి సంభందించి నాగబాబు అత్యంత సన్నిహిత వర్గాలను సంప్రదించింది. కానీ ఒక తమ్ముడిగా కళ్యాణ్ ఎదుగుదలను నాగబాబు ఎప్పడు కోరుకుంటారు గానీ పొలిటికల్ జర్నీ గురించి ఇంకా ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేదని వారు తెలిపారు.
Tags:Threaten with triangular competition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *