క‌త్తి కార్తీక‌కు బెదిరింపులు

Date:18/09/2020

మెద‌క్ ముచ్చట్లు:

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్థానం నుంచి టీవీ నటి, బిగ్ బాస్ ఫేం అయిన కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమెకు గురువారం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పరోక్షంగా బెదిరింపులు ఎదురయ్యాయి. అన్నీ సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని, లేదంటే సజీవ దహనం చేస్తామని దుండగులు హెచ్చరించారని కత్తి కార్తీక వెల్లడించారు. మెదక్ జిల్లా రామాయం పేట సమీపంలో ఈ ఘటన జరగ్గా ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కత్తి కార్తీక, ఆమె డ్రైవర్, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్తీక డ్రైవర్ ద్విచక్ర వాహనంపై గురువారం ఉదయం 8.30 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రామాయం పేట వెళ్తున్నాడు. రామాయంపేటలోని అడిగాస్ హోటల్ దగ్గర ఓ ఇన్నోవాలో వచ్చిన నలుగురు వ్యక్తులు డ్రైవర్‌ను అడ్డగించారు. ‘‘కత్తి కార్తీకతో పాటు నువ్వు కూడా అన్నీ సర్దుకొని హైదరాబాద్ పారిపోండి. లేదంటే కాల్చిపారేస్తాం.’’ అని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ బైక్‌ను అక్కడే వదిలిపెట్టి పొలాల్లోకి పరుగు పెట్టాడు.ఆ వెంటనే కత్తి కార్తీకకు ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఆమె బయలుదేరి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

రైల్వే లో… యూజర్ ఛార్జీలు

Tags:Threats to Katti Karthik

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *