ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లాలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను బద్వేల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 వేల 350 రూపాయల విలువ చేసే బంగారు ముక్కు పుడక, చిన్న అమ్మవారి ఇత్తడి లోహపు విగ్రహం, ఒక బైక్, రెండు కటింగ్ ప్లేయర్లు, ఇనుప కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Three arrested for temple robberies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *