గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు
మదనపల్లె ముచ్చట్లు:
గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా ఒకరు పరారీ అయ్యాడని అన్నమయ్య జిల్లా డిఎస్పీ కేశప్ప తెలిపారు. నేడు మదనపల్లె టుటౌన్ పోలీస్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు మహబూబ్ బాషా, సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మదనపల్లె మండలం సిటిఎం రైల్వేస్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేయగా ఒకరు పరారీ అయ్యాడన్నారు. అరెస్టు చేసిన వారి నుంచి నాలుగున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఉమాశంకర్, ఉదయ్ కిరణ్, హరినాథ్ ఉన్నారని, పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రకాష్ ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Tags: Three arrested in ganja case

