ముగ్గురు చైన్ స్నాచర్స్ అరెస్ట్
గుంటూరు ముచ్చట్లు:
గత ఆరు నెలలుగా వరుస చైన్స్నాచింగ్ నేరాలతో పోలీసులను హడలెత్తించిన ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ధరణికోటకు చెందిన సయ్యద్ యాసిన్ అమానుల్లా, పఠాన్ మన్సూర్, అరండల్పేటకు చెందిన షేక్ మహ్మద్ హుస్సేన్ను అరెస్టు చేసి వారి నుంచి రూ.7,68,000 ఖరీదైన 312 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. గతంలో ధరణికోటలో ఉన్న సమయంలో యాసిన్, మన్సూర్లు స్నేహితులు. వీరిరువురు కారు డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. అయితే చెడు అలవాట్లకు లోనై కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరుచైన్ స్నాచింగ్ నేరాలను ప్రారంభించారు. వీరి స్నేహితుడైన బంగారం పని చేసే మహమ్మద్ హుస్సేన్లో కలిసి వీరు నగరంలో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గత జులై నుంచి డిసెంబరు వరకు అరండల్పేట స్టేషన్ పరిధిలో 2, పట్టాభిపురం స్టేషన్ పరిధిలో 7 వెరసి 9చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డారు. ఈ ముఠాను అరెస్టు చేసేందుకు అర్బన్ అదనపు ఎస్పీ కె.సుప్రజ ఆధ్వర్యంలో అరండల్పేట, పట్టాభిపురం పోలీసులు 230 సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. పట్టాభిపురం సీఐ రాజశేఖరరెడ్డి, ఎస్ఐలు అబ్దుల్ రెహ్మాన్, ఎస్.రవీంద్ర, డి.ప్రవీణ్, కానిస్టేబుళ్లు ఈ ముఠాను అరెస్టు చేసినట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఎస్పీ నగదు రివార్డులతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags:Three chain snatchers arrested