రామసముద్రంలో ముగ్గురు చిన్నారులు మృతి

– మృతుల్లో అన్నదమ్ములు, స్నేహితుడు

Date:29/11/2020

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలంలోని గుంతవారిపల్లెదిన్నెకు చెందిన రామిరెడ్డి కుమారులు వినయ్‌(15) (పదోతరగతి) , అతని తమ్ముడు యశ్వంత్‌ (12) (ఎనిమిదోతరగతి) చదువుతున్నాడు. వీరిద్దరు కలసి విశ్వనాథరెడ్డి కుమారుడు నాగభూషణ(15) (పదోతరగతి) తో కలసి చెరువులో ఆడుకునేందుకు వెళ్లారు.చెరువులో ఆడుకునే సమయంలో జెసిబితో తీసిన గుంతలో నాగభూషణ, యశ్వంత్‌ పడిపోయారు. ఈ సమయంలో వినయ్‌ వారిని కాపాడే ప్రయత్నం చేయడంతో ఆ బాలుడు పడి మునిగిపోయారు. ఇదే సమయంలో మోక్షజ్ఞ అనే బాలుడు ఈ సంఘటన చూసి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతులు కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గరు మృతి చెందారు. కాగా మృతి చెందిన కుటుంభాలు పేదవారు కావడం గమనార్హం. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా రెండు కుటుంబాల్లోని ముగ్గరు పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలు ఆవిసేలా రోధించడం పలువురిని కలచివేసింది. ఈ మేరకు ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి, శవాలను పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

ముంచుకొస్తున్న మరో ముప్పు

Tags: Three children were killed in Ramasamudram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *