పుంగనూరులో మూడు అగ్నిప్రమాదాలు – లక్షమేర నష్టం
పుంగనూరు ముచ్చట్లు:
వేసవి తీవ్రంకావడంతో ఆదివారం వివిధ ప్రాంతాలలో మూడు అగ్నిప్రమాదాలు సంభవించింది. మండలంలోని గూడూరుపల్లెకు చెందిన గోపాల్ కు చెందిన గడ్డివామి వేకువజామున అంటుకుంది. అలాగే పట్టణంలోని ఎంఎస్‌ఆర్ •యెటర్ వెనుక రమేష్‌బాబుకు చెందిన వెదురుతోపుకు సాయంత్రం ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టడంతో మంటలు తీవ్రమైంది. అలాగే రామసముద్రం మండలం మినికి గ్రామంలో మధ్యాహ్నం మామిడి తోటలకు నిప్పు పెట్టారు. ప్రమాదాల గురించి సమాచారం అందుకుని అగ్నిమాపకశాఖాధికారి సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సుబ్రమణ్యం, మోహన్, రాజశేఖర్, ఇమానియల్ వెళ్లి మంటలను ఆర్పివేసి ప్రమాదాలను నివారించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు మాట్లాడుతూ వేసవి కావడంతో మామిడి తోటలు, గడ్డివాములు, పంటల వద్ద ఎవరైనా ఆకతాయిలు బీడీలు అంటించి వేయడంతో మంటలు రావడం, పంటలు నష్టం కావడం జరుగుతోందన్నారు. రైతులు తమ సరిహద్దుల్లో ఎండు ఆకులు, చెత్తలేకుండ శుభ్రం చేసుకుంటే రోడ్డుపై నుంచి మంటలు వచ్చినా పంటలు కాలిపోకుండ ఉంటుందని సూచించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Tags; Three fires in Punganur – damage to the tune of lakhs
