అదిలాబాద్ లో  మూడున్నర లక్షల మంది ఓటర్లు

Date:19/05/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా  గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో  3,36,647 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,68, 741 మంది పురుషులు, 1, 67, 825 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తండాలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం కొనసాగుతున్న పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం జూలై నెలతో ముగిసిపోనుంది. ఆగస్టు నుంచి కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో పం చాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించడంతో పాటు వివిధ మండలాల్లో అధికారులు ఓట ర్ల జాబితాలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఓటర్ల తుది జా బితా ప్రకటించిన తరువాత కులా ల వారీగా ఓటర్ల గణన చేపట్టనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఓటర్ల సంఖ్య తెలిసిన తరువాతనే రిజ ర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సర్పంచ్ పదవుల్లో  ఎస్‌సిలకు 16 శాతం, ఎస్‌టి లకు 6 శాతం, బిసిలకు 34 శాతం రిజర్వ్ చేయగా మిగత పదవులను జనరల్ కేటగిరికి కేటాయించనున్నారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో సర్పంచ్ స్థానాలు రిజర్వ్ చేయనున్నారు. అయితే ఈ స్థానాలకు ఎక్కడెక్కడ రిజర్వ్ చేయనున్నారనేది కులాల వారీగా ఓటర్ల సంఖ్య తేలిన తరువాతనే నిర్ణయించనున్నారు. తుది జాబితా ప్రకటించిన 15 రోజుల్లో అంటే జూన్ మొదటి వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. సర్పంచ్ పదవుల మాదిరిగానే వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతమున్న పంచాయతీల పాలకవర్గాల గడువు జూలై 31తో ముగుస్తుంది. జూన్ మొదటి వారంలోపు రిజర్వేషన్లకు అవరసమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాబా వివరాలను పంచాయతీల వారీగా ప్రభుత్వానికి నివేదించేందుకు అధికార యంత్రాంగం కరసరత్తు చేస్తోంది. జిల్లా నుంచి ఆయా సామాజిక వర్గాల జనాభా వివరాలు ప్రభుత్వానికి చేరిన వెంటనే రిజర్వేషన్ల ప్రక్రియను చేపడుతారు. రిజర్వేషన్ల ప్రకటనకు ముందు జిల్లాలో చేయాల్సిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తుంది. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణపైన కసరత్తును వేగవంతంగా చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ఆధారంగానే నిర్వహించనున్న నేపధ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఆదేశిస్తే నిర్ణీత గడువులోగా ఎన్నికలను నిర్వహించేందకు వీలుగా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Tags: Three hundred and half lakh voters in Adilabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *