మున్నూరు కాపు శ్రీరామ పునర్వసు దీక్షలు

-తెలంగాణ మున్నూరు కాపు సంఘం సెక్రటరీ జనరల్ హరి అశోక్ కుమార్

Date:05/12/2020

జగిత్యాల  ముచ్చట్లు:

పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కార్తీక బహుళ మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నుంచి మున్నూరు కాపు భక్తులు వచ్చి శ్రీరామ పునర్వసు దీక్షను స్వీకరించినట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ హరి అశోక్ కుమార్ తెలిపారు దీక్షాపరులకు ఆలయ ప్రధాన అర్చకులు అమరవాది  విజయ రాఘవన్ శ్రీరామరక్ష చదివిన పిదప శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే అనే మంత్రాన్ని మనసులో ఈవో శివాజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో దీక్షాపరులకు మెడలో తులసి మాలలు వేశారని దీక్షాపరులకు దేవస్థానం వారు రెండు పూటలా ఆలయ దర్శన సౌకర్యం కల్పించారని వీరు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రామాలయం వద్దకు చేరుకోవాలని ఆదివారం శ్రీరామచంద్ర స్వామికి అభిషేకం ఉంటుందని 8 గంటల 30 నిమిషాలకు సర్వ దర్శనం కల్పిస్తారన్నారు 27 నక్షత్రాలకు బదులు దేవస్థానం వైదిక కమిటీ ప్రభుత్వం 27 రోజుల పాటు దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తుందని హరి అశోక్ కుమార్ తెలిపారు 6 దీక్షలు చేపట్టిన మున్నూరు కాపు భక్తులకు తమ సంఘం తరఫున హరి అశోక్ కుమార్ రాష్ట్ర ప్రతినిధులు పూలమాలవేసి అభినందించారు.

జాంభి రెడ్డి” టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!

Tags: Three hundred Kapu Srirama Rehabilitation Initiations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *