ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నం
–ఇద్దరు మృతి… పోలీసు వేధించపులని ఆరోపణ
అనంతపురం ముచ్చట్లు:
పోలీసుల వేధింపులతోనే తన కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తల్లి షేకున్ బీ,సోదరుడు మన్సూర్ భాషలు మృతి చెందినట్లు బాధితుడు మహబూబ్ భాషా ఆరోపించాడు.
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామంలో కనేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపుల కారణంగా తన తల్లి షేకున్ బీ, తండ్రి సలీమ్ భాషా సోదరుడు మన్సుర్ భాష లు పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యుడు మహబూబ్ బాషా తెలిపాడు.మూడేళ్ల క్రితం కనేకల్ కు చెందిన హసీనాబానుతో తన సోదరుడు మన్సూర్ భాషకు వివాహమైందని తెలిపాడు.ఇటీవల కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా గొడవలు జరిగాయని తెలిపాడు.తల్లి,తండ్రి,సోదరుని పై కనేకల్ పోలీస్ స్టేషన్లో తన వదిన హసీనా బాను ఫిర్యాదు చేసిందని తెలిపాడు. అయితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇంటికి వచ్చి చిత్రహింసలకు గురి చేయడంతో పాటు బెదిరించి తన సోదరునిపై చేయి చేసుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసుల వేధింపులు తాళ్ళలేక ఇంట్లో పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించారని వాపోయాడు.మెరుగైన వైద్యం కోసం వారిని బళ్లారి విమ్స్ కు తరలించినట్లు తెలిపాడు. చికిత్స పొందుతూ పరిమి పరిస్థితి విషమించి సోదరుడు మన్సూర్ భాష, తల్లి షేకున్ బీ లు మృతి చెందినట్లు వాపోయాడు.

Tags: Three in the same family attempted suicide
