వైసీపీలోకి ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు

విశాఖపట్నం ముచ్చట్లు :

 

విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ బలం 61కి పెరిగింది. విశాఖ నగరం తిమ్మాపురంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యులు వి.విజయసాయి రెడ్డి సమక్షంలో జీవీఎంసీలోని 32, 35, 39వ వార్డులకు చెందిన స్వతంత్ర కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహమ్మద్‌ సాధిక్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు జీవీఎంసీ మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నాయకుడు సూరిశెట్టి లక్ష్మణ్‌ కూడా పార్టీలో చేరారు. అలాగే వైఎస్సార్సీపీ నుండి సస్పెన్షన్‌కు గురైన తాతారావును కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు.

 

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

Tags; Three independent corporators into the YCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *