రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నెల్లూరు ముచ్చట్లు:
ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న కంటైనర్ ను వెనుక వైపు నుండి ఇన్నోవా కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.. మృతి చెందిన వారిలో కారు డ్రైవరు, యువతి ,నాలుగేళ్ల బాలుడు ఉన్నారు… గాయపడ్డ మరో నలుగురిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు… అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది…మృతులు కొడవలూరు మండలం దామెరగుంట నుండి చెన్నై కు హాస్పిటల్ కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది… ప్రమాదంలో మృతిచెందిన వారు యువతిని మెర్సి(15 ), సనత్ తేజ్, (5)రామారావు( 35) గా గుర్తించారు… ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణం చేస్తున్నారు… క్షతగాత్రులను కోవూరు మండలం పడుగుపాడు వీఆర్వో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా గుర్తించారు… ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కంటైనర్ కింద కారు ఇరుక్కుపోవడంతో క్రేన్ ఉపయోగించి మృతదేహాలను వెలికి తీశారు… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
Tags: Three killed in a road accident

