పిడుగుపాటుకు ముగ్గురు మృతి

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరం జిల్లాలో పిడుగు పడి శనివారం ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన కొందరు పశువులను మేత కోసం పొలాలకు తోలుకొని వెళ్లారు. మధ్యాహ్నం పైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం పడుతూ ఉండడంతో అందరూ చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఆవులు కూడా మృతి చెందాయి.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags; Three killed in lightning strike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *