స్కూటర్ లో మూడు లక్షల నగదు

స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖమ్మం ముచ్చట్లు:

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మంలో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.  ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతం బోస్ బొమ్మ సెంటర్ వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారిని సుమలత ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 3 లక్షల నగదును పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి కొప్పుల వెంకటేశ్వర్లు  యాక్టివా స్కూటీలో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు. ఈ వాహన తనిఖీల్లో త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడ్డ నగదును ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి సుమలత పోలీసుల సమక్షంలో డిపాజిట్ చేశారు.

 

Post Midle

Tags:Three lakh cash in the scooter

Post Midle