సెల్ఫీ సరదాకు మూడు ప్రాణాలు బలి

చిత్తూరు ముచ్చట్లు:

 

సెల్పీ సరద ముగ్గురు యువకుల మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల పరిధిలోని ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం వద్ధ చోటు చేసుకుంది.తమిళనాడు చెన్నైకు చెందిన లోకేష్ భార్య ప్రియ తో కలిసి ప్రముఖ పర్యాటక కేంద్రానికి వచ్చారు. మార్గం మధ్యలో గుమ్మడి పూండి నుండి తమ స్నేహితులు కార్తీక్ , యువరాజ్ , బాలాజీ లను వెంటతీసుకుని వచ్చారు.కరోనా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉబ్బల మడుగు పర్యాటక కేంద్రం లోనికి    అటవీశాఖ సిబ్బంది వీరిని అనుమతిం చలేదు.దీంతో పక్కనే ఉన్న తెలుగు గంగా కాలువ వద్ధకు వెళ్ళారు. వీరిలో యువరాజ్ సెల్ఫీ తీసుకుంటూ కాలు జారీ ప్రమాదవ శాత్తు తెలుగు గంగా కాలువలో పడిపోయాడు. ఇది గమనించిన లోకేష్ ,కార్తీక్ ,బాలా జీ స్నేహితుడిని కాపాడాలని వెనువెంటనే కాలువలోకి దూకారు. యువరాజు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు.యువరాజు కోసం కాలువలో దూకిన లోకేష్ , కార్తీక్, బాలాజీ నీటి ప్రవాహ తాకిడికి మృత్యువాత పడ్డారు.ప్రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యవేడు మండలం లోని రాజగోపాలపురం వద్ధ తెలుగు గంగా కాలువలో ఇద్దరి మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Three lives were sacrificed for selfie fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *