మూడు ఎల్ఓసిలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని ముచ్చట్లు:
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంథని నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మూడు లక్షల 50 వేల విలువచేసే మూడు ఎల్ఓసి లను మంజూరు చేయించారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన గంజి జస్విక హార్ట్ సర్జరీ సంబందించి 1 లక్ష రూపాయల ఎల్ఓసి, ముత్తారం మండలం ఒడేడు గ్రామానికి చెందిన మొగిలి రాకేష్ కు కుడి చేతికి చికిత్సకు సంబంధించి లక్ష రూపాయల ఎల్ఓసి, కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన కుంభం రాకేష్ గుండెకు సంబంధించి చికిత్సకు లక్ష యాభై వేల రూపాయల ఎల్ఓసి లను మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. వీరంతా నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతు సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కలువగా వెంటనే ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo ముగ్గురికి మూడు లక్షల 50 వేల విలువ చేసే విలువ సిలు మంజూరు చేయించారు. మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసుపత్రి సహాయకులు నాగరాజు సోమవారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసిలు అందజేశారు.
Tags: Three LoCs were granted by MLA Sridhar Babu

