పోలీసులు అదుపులో ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్లు
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
నిషేధిత మావోయిస్టు పార్టీ మిలిటెంట్లను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్ల మండలంలోని వెంకటచేరువు గ్రామ అటవీప్రాంతంలో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బందితో నిర్వహించిన వాహన తనిఖీలలో మావోయిస్ట్ మిలిటెంట్లు దొరికిపోయారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మడివి గంగ మూడ (25), మడివి అంద (35), కొవ్వసి మంగు (30) లు పోలీసులకు దొరికిపోయారు. వీరంతా మిలీషియా సభ్యులుగా ఉంటూ, నిషేధిత మావోయిస్ట్ పార్టీకి గత కొంత కాలంగా పని చేస్తూనట్లుపోలీసులు నిర్దారించారు. మావోయిస్ట్ పార్టీ నిర్వహించే మీటింగులకి, సభలకి ఇతర గ్రామాల నుండి ప్రజలను రావడం, మావోయిస్ట్ పార్టీకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించడం లాంటివి చేస్తుంటారు. అందులో భాగంగా మావోయిస్ట్ పార్టీకి చెందిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర అగ్రనాయకులు, బెటాలియన్ కమాండర్ హిడ్మ, మరియు పామేడ్ ఏరియా కమిటీ సభ్యులు, అలాగే తెలంగాణ రాష్ట్ర సిపిఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు దామోదర్, ఆజాద్, మధు, అరుణ, లచ్చన్న, మంగతు,అర్జున్ మరియు ఇతర దళ సభ్యులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను బహిష్కరించండి అని చెప్పే కరపత్రాలను చర్ల గ్రామ శివారులలో వేసి రావాలని అలాగే త్వరలో దీనికి సంబందించిన మీటింగ్ ఉంటుందని,దానికి సిద్దంగా ఉండాలని చెప్పే సమాచారం.

చెరవేయాలని ఈ ముగ్గురిని ఆదేశించి వీరికి 60 కరపత్రాలను ఇచ్చి పంపించారు. దాంతో ఈ ముగ్గురు చర్ల గ్రామానికి పరిసర గ్రామలలో అట్టి కరపత్రాలను వేయడానికి వస్తూ,వెంకట చెరువు గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహించే పోలీస్ వారికి తారసపడ్డారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకోవడం జరిగినది. వీరి వద్దనుండి 60 కరపత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగినదని ఏఎస్పీ భద్రాచలం పరితోష్ పంకజ్ వెల్లడించారు.అంతేకాకుండా నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎవరైనా సహకరించి సంఘవిద్రోహక చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు జరుగుతుందని ఆస్పిరంట్ హెచ్చరించారు. ఈ కార్యక్రమoలో చర్ల సిఐ బి.రాజగోపాల్, ఎస్ఐలు టి.వి.ఆర్. సూరి, ఆర్. నర్సిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Three Maoist militants are in police custody
