టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
తిరుమల ముచ్చట్లు:
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే.వీరిలో తుడ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ధర్మకర్తల మండలి సభ్యులుగా సుదర్శన్ వేణు, నెరుసు నాగసత్యం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.స్వామివారి దర్శనానంతరం బోర్డు సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో వీరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు లోకనాథం, గోవిందరాజన్, హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:Three members of the Board of Trustees of TTD took oath
