Three nannies tour in Bandar

బందర్ లో ముగ్గురు నానిలు పర్యటన

Date:27/05/2020

మచిలీపట్నం ముచ్చట్లు:

 

పేర్ని నాని ఇలాకాలో ఆళ్ల నాని కృష్ణా జిల్లా మచిలీపట్నం లో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని సమావేశం.రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో కొత్తగా 16ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటుచేయాలని సంకల్పం..మచిలీపట్నం R&B అతిధి గృహం లో ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సివిల్ సప్లై మంత్రి కొడాలి నానిలకు స్వాగతం పలికిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని..ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు పై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఇంతియజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కు సంబందించిన స్థలం పరిశీలన..పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం.రాష్ట్రము లో ఇక పై ప్రజలకు అందుబాటులోకి రానున్న వైస్సార్ విలెజ్ క్లినిక్ లు.రాష్ట్రము లో ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన.

 

గ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోలో తెస్తున్నాం.ప్రతి రోగికి ప్రాధమిక వైద్యం అందాలని ప్రభుత్వం ఉద్దేశ్యం.పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు ఉపయోగ పడతాయి.రాష్ట్రము లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భోధన హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా పేదలకు స్పెషలిటీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆశయం.అన్ని భోధన హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తాము.ప్రతి టీచింగ్ హాస్పిటల్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం.జులై 8న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైస్సార్ చిరునవ్వు..కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.రాష్ట్రము లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా దంతవైద్యం అందిస్తాము.

ఉన్నత చదువులతోనే పేదరికం నుంచి విముక్తి 

Tags: Three nannies tour in Bandar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *