మూడు ప్రాణాలు బలిగొన్న అబ్దుల్లాపూర్ మెట్ భూములు

Date:09/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

భూహక్కుల కోసం మూడు వర్గాల మధ్య గొడవతో ఓ మూడు ప్రాణాలు కోల్పొయాయి. ఎమ్మార్వో విజయారెడ్డి, అటెండర్,  నిందితులు సురేష్ రోజుల వ్యవధిలో  మరణించారుపరిష్కరించే వ్యవస్థలను ఆశ్రయించకుండా తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం భూ వివా దం ఈనాటిది కాదు. గతంలో గౌరెల్లి గ్రామానికి చెందిన గత పట్వారీ రాజా ఆనంద్‌రావుకు 412 ఎకరాల పట్టాభూమి ఉంది. ఈ భూమిలో సర్వే నం. 96లో 37ఎకరాల భూమిని ఆనంద్‌రావు 1954లో అదే గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు విక్రయించారు. కొనుగోలు చేసిన భూమిని 1996లో ఆర్వోఆర్‌ కింద పట్టా చేయించుకుని పాసుపుస్తకాలు కూడా పొందారు. అప్ప టి నుంచి ఈ భూమిపై అదే గ్రామానికి చెందిన రైతులు సాగుచేసుకుని జీవిస్తున్నారు. గతంలో ఈ భూమి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా వెళ్లడంతో ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కూడా ప్రస్తుతం కబ్జాలో ఉన్న రైతులకే అం దింది. ఇదిలాఉండగా ఈ భూమిపై 2014లో రక్షిత కౌలుదారు హక్కు(38 పట్టా) తమకు ఉందని ఇదే గ్రామానికి చెందిన అహ్మత్‌ హయత్‌, అతని సోదరులు ఉన్నాయని ఇబ్రాహీంపట్నం ఆర్డీఓను ఆశ్రయించారు. దీంతో ఆర్డీఓ రక్షిత కౌలుదారు హక్కు ఉన్న అహ్మత్‌ హయత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ భూములు కొనుగోలు చేసిన రైతులు అధికారులను ఆశ్రయించారు. 2016లో ఈ భూమిపై రక్షిత కౌలుదారు హక్కు ఉన్నందున పూర్తి హక్కులు హయత్‌కే ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ఈ భూమిని సుమారు 70ఏండ్ల క్రితం కొనుగోలు చేసి ఇప్పటివరకు తామే కాస్తులో ఉన్నామని, గతంలో పట్టా కూడా తమకే ఇచ్చారని వాపోయారు. బయటి వ్యక్తులకు ఎలా హక్కులు కల్పిస్తారని రైతులు మొర పెట్టుకున్నారు.

 

 

 

 

 

 

 

 

అధికారులు జారీ చేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమిని కొందరు అనుకూల తీర్పు పొందిన వారి నుంచి కొందరు రియల్టర్లు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయినగర శివార్లలోనే ఉండడంతో అంతులేని రియల్‌ దందాకు తెర లేసింది. దీంతో భూ అమ్మకాలు, కొనుగోళ్లు అధికమయ్యా యి. రూ.లక్షలు పలికే భూములు రూ.కోట్లకు చేరాయి. ఎన్నో ఏండ్ల క్రితం అమ్ముకొని వెళ్లినోళ్లకు కూడా ఆశలు రేకెత్తాయి. సాదాబైనామాల కింద విక్రయించిన అమ్మకాలపై వారసుల తిరుగుబాటు బావుటాతో వివాదాలు ముసిరాయి. సాగుకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ వెం చర్లు, డూప్లెక్స్‌లతో ఆ ప్రాం త రూపురేఖలే మారిపోయాయి. పైగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో నగరంలోని ఏ మూలకైనా గంటల్లో పు చేరే వీలుంది. అంతే.. కొనుగోలుదార్లకు దూరాభారం కనుమరుగైంది. నగరానికి 20 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ గజం ధర రూ.వేల ల్లో పలుకుతోంది. అన్నింటికీ మించి దాదా పు రాష్ట్రంలోనే దాదాపు అతి పెద్దదిగా అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలం నిలుస్తోంది. హైదరాబాద్‌ నగర శివార్లల్లో 35 రెవెన్యూ గ్రామాలు కలిగిన మం డలం ఇదే. గ్రామీణ స్థాయిలోనైతే అమ్మకాలు, కొనుగోళ్ల సంఖ్య పదుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడా పరిస్థితులు లేవు. గుంట భూమికి కూడా నాలుగైదు సేల్‌డేడ్స్‌ కనిపిస్తున్నాయి. అందుకే అదేస్థాయిలో వివాదాలు నెలకొన్నాయి. కోర్టు కేసుల మూలానా వేలసంఖ్యలో పాసు పుస్తకాలు జారీ కాలేదు. సీసీఎల్‌ఏ తెలంగాణ వెబ్‌సైట్‌లో ‘పెండింగ్‌ ఫర్‌ క్లియరెన్స్‌’ జాబితా చూస్తే చాలు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఎంతటి వివాదాస్పదమైనదో అర్థ్ధమవుతుంది.

 

 

 

 

 

 

 

 

ఒక్క బాచారం రెవెన్యూ పరిధిలోనే కొన్ని వందల సర్వే నంబర్లు ‘పార్టు బీ’లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కోర్టుల్లో నలుగుతోన్న కేసుల సంఖ్య కూడా అధికమే. ఈ క్రమంలోనే హైకోర్టుకు హాజరై వచ్చిన నాడే తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణహత్యకు గురైనట్లు తెలుస్తోంది. సజీ వదహనం వెనుక అంతులేని కథ ఉన్నట్లు సమాచారం. ఒక్కో ఊర్లో ఒకటీ రెండు కాదు.. పదులు, వందల సంఖ్యలో వివాదాలు, కేసులు ఉన్నాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రికార్డుల్లో ఒకరు, మోఖా మీద ఇంకొకరు, సేల్‌డీడ్స్‌తో మరొకరు.. ఇలా భూమి చుట్టూ హక్కుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐతే ఏ సమస్యకైనా పరిష్కారం ఉందన్న వాస్తవాన్ని గ్రహించ ని ఓ మూర్ఖపు నిర్ణయానికి, అమానుష ఘటనకు ఓ అధికారి బలైందన్న వాదన వినిపిస్తోంది. కిందిస్థాయిలో పరిష్కారం లభించకపోతే పైస్థాయిలో ఫిర్యాదుకు హక్కు ఉందన్న కనీస అవగాహన లేని వ్యక్తుల వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బాచారం రెవెన్యూపరిధిలోని సర్వేనంబర్‌ 87 నుంచి 101 వరకు సుమారు 412 ఎకరాలు ఉంది. ఈ భూమి పేరుకు మాత్రమే బాచారం రెవెన్యూలో ఉండగా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతుల ఆధీనంలో ఉంది. వారే సాగు చేసుకుంటున్నారు. సీసీఎల్‌ఏ తెలంగాణ వెబ్‌సైట్‌లో ‘పెండింగ్‌ ఫర్‌ క్లియరెన్స్‌’ను పరిశీలిస్తే పట్టాదారులు ఒక రు, అనుభవదారులు వేర్వేరుగా ఉన్న సర్వే నంబర్లే అధికంగా ఉన్నాయి.

 

 

 

 

 

 

 

 

 

ఒకటీ రెండు కాదు. వందలసంఖ్యలో కనిపిస్తుండడాన్ని బట్టి బాచారం చుట్టూ భూవివాదాలు ప్రదక్షిణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒక్కో సర్వే నంబరులో బై నంబర్ల సంఖ్య కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. లెక్క లేనన్ని బై నంబర్లతో కొనుగోళ్లు జరిగాయి. అందుకే పెండింగ్‌ ఫర్‌ క్లియరెన్స్‌లో సంఖ్య చాంతాడంత కనిపిస్తుండడం గమనార్హం. ఖాతా నంబర్లలోనూ వందలు మిస్‌ అయ్యాయి. అంటే వివాదాల సుడిగుండంలో కొనుగోలు, అమ్మకందారుల సంఖ్య చాలాపెద్దదే. ఈ కేసులు, వివాదాలన్నీ తెం పేందుకు ఓ వ్యవస్థ ఏర్పాడాల్సిందే. ఒకరో, ఇద్దరో చేసే పనిలా లేదని తెలుస్తోంది. ఈ దస్ర్తాలను క్లియర్‌ చేసేందుకు ఇరుపక్షాలను వాదనలు విని రెవె న్యూ లెక్క తేల్చేందుకు చాలా సమయమే పట్టేటట్లు కనిపిస్తోంది. ఇది ఒక్క బాచారం కథ మాత్రమే. మున్సిపాలిటీలుగా మారిన తుర్కయంజాల్‌, పెద్దఅంబర్‌పేటల్లోనూ భూ దందాల వెనుక వివాదాలు అనేకం ఉన్నాయి. ఏదే ని సర్వే నంబర్లల్లో ఉన్న విస్తీర్ణం కంటే అధికంగా క్రయవిక్రయాలు జరిగిన ఉదంతాలు కూడా అనేకం ఉన్నట్లు సమాచారం.

 

కరీంనగంలో అండర్ గ్రౌండ్ డస్ట్ బిన్స్

 

Tags:Three of the victims were Abdullapur Met lands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *