Natyam ad

ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు

– వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారు, సమాధానం ఏది.పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి. అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి?. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు?. ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి.

 

Tags: Three of them came on the same stage with no face

Post Midle