వ్యూహాల‌తో దూసుకెళుతున్నఆ ముగ్గురు

Date:13/10/2018
ఖమ్మం ముచ్చట్లు:
శ‌కునం చెప్పే బ‌ల్లి కుడితిలో ప‌డ‌టం వినేవుంటారు. జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌గ‌ల నేత‌లు.. చివ‌ర‌కు సొంత‌జిల్లాలో మాట నెగ్గించుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. పోటీ వ‌దిలేద్దామంటూ కేడ‌ర్లో  ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. స‌ర్దుకుపోదామంటే అహం అడ్డొస్తుంది. ఇదంతా తెలంగాణ‌లో రాజ‌కీయ ఖిల్లాగా పేరున్న ఖ‌మ్మం జిల్లా సంగ‌తి. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదే ప‌రిస్తితి ఉంది.
పైగా మొన్న‌టి వ‌ర‌కూ టీడీపీలో ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గులాబీ గూటిలో ఉన్నారు. ఇక ఇప్పుడు నామా నాగేశ్వ‌రావు టీడీపీ బాద్య‌త‌లు చేప‌ట్ట‌వచ్చ‌నే ప్ర‌చారం సాగుతుంది. ఇక‌పోతే.. కాంగ్రెస్‌లో మాత్రం ఎవ‌రికి ప‌ట్టం క‌ట్టాలి. ఎవ‌రికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నేది మాత్రం ముడిప‌డ‌ట్లేద‌ట‌. పైగా ముగ్గురూ కీల‌క‌మైన నేత‌లు..ఢిల్లీలోనూ అదిష్టానం వ‌ద్ద అర‌చేతి  మందం ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లు. దీంతో ఢిల్లీ నుంచి వ‌చ్చిన నేత‌లు కూడా ముగ్గురి మ‌ధ్య స‌యోద్య కుద‌ర్చ‌టం మావ‌ల్ల కాదంటూ చేతులెత్తేశారు.
దీంతో ఇప్ప‌టికీ ఆ జిల్లాలో పార్టీ అధ్య‌క్షుడిని నియ‌మించ‌లేక స‌తికిల‌ప‌డిన‌ట్లుంది.  ఎవ‌రికి వారు త‌మ అనుచ‌రుల పేర్ల‌ను ఇచ్చి వీరే జిల్లా అధ్య‌క్షుడంటూ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎదుట ఉంచారు. దీంతో ఉలికిపాటుకు గురైన ఉత్త‌మ్‌..ఈ పంచాయితీ నాకెందుకంటూ పార్టీ హైక‌మాండ్ వ‌ద్ద‌కు చేర‌వేశాడు. అక్క‌డ నుంచి ప‌రిశీల‌న‌కు  వ‌చ్చిన పార్టీ సీనియ‌ర్లు కుంతియా, దిగ్విజ‌య్‌సింగ్ వంటి త‌ల‌పండిన వారు కూడా.. అమ్మో ఈ తీర్పు మా వ‌ల్ల‌కాదంటూ చేతులెత్తి ద‌ణ్న‌మెట్ట మ‌రీ జారుకున్నార‌ట‌. ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో అన్ని పార్టీలు ప్ర‌చారం..
వ్యూహాల‌తో దూసుకెళుతుంటే.. ముగ్గురు నేత‌లు మాత్రం ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా మారారు. పైకి.. మేమంతా ఒక‌టే.. మా మ‌ధ్య గొడ‌వల్లేవంటూ మీడియా ముందు ఫొటో ల‌కు ఫోజులిస్తారు. ఇంత‌కీ ఆ ముగ్గురు నేత‌లు ఎవ‌ర‌నేది.. రేణుకాచౌద‌రి, పొంగులేటి సుదాక‌ర్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌. ముగ్గురూ జాతీయ‌స్థాయి నాయ‌కులు. అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. అవ‌స‌ర‌మైతే కార్య‌క‌ర్త‌ల‌ను ఏక‌తాటిపైకి తీసుకురాగ‌ల‌రు. గెలిపించ‌గ‌లరు..
ఓడించ‌నూ గ‌ల‌రు. కానీ ముగ్గురూ ఆధిప‌త్యం చాటుకునేందుకు పార్టీ ప్ర‌తిష్ఠ‌నే మ‌స‌క‌బార్చుతున్నారు. మ‌హాకూట‌మితో జ‌త‌క‌ట్టిన త‌రువాత గెలుపుపై అవ‌కాశం మ‌రింత పెరిగింది. టీడీపీకు బ‌ల‌మైన కేడ‌ర్‌. సామాజిక‌వ‌ర్గ అండ‌దండలు త‌మ‌కూ అనుకూలిస్తాయ‌నే కాంగ్రెస్ బావిస్తుంది. కానీ.. సొంత‌నేత‌ల తీరుతో మౌనం వ‌హిస్తుంది.పిల్లిపోరు పిల్ల‌పోరు పిట్ట తీర్చిన‌ట్టు.. ఈ ముగ్గురి మ‌ద్య ఆధిప‌త్య దోర‌ణి.. వ‌ర్గ విబేదాలు తప్ప‌కుండా గులాబీ నేత‌ల‌ను గెలిపిస్తాయంటూ కారు పార్టీ  తెగ సంబ‌ర‌పడిపోతుందట‌.
Tags: Three of those tactical tactics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *