Natyam ad

పుంగనూరులో చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి-ఒకరి పరిస్థితి విషమం.

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని అరవపల్లె వద్ద కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళం గ్రామానికి చెందిన భాగ్యరాజ్, కుమారు, రవి, మరో వ్యక్తి కలసి బెంగళూరుకు వెళ్లి తిరిగి వేకువదామున పుంగనూరు సమీపంలోని అరవపల్లి వద్దకు రాగా కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ఒకరు తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అర్బన్ సీఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Post Midle

 

 

Tags:Three people were killed when the car collided with a tree

Post Midle