పుంగనూరులో ముగ్గరు పేకాటరాయుళ్ల అరెస్ట్ -సీఐ రాఘవరెడ్డి
-రూ.19,400 స్వాధీనం
పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని నెక్కుంది గ్రామ చెరువులో పేకాట ఆడుతున్న ముగ్గరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19,400 లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో పట్టణంలోని కోనేటిపాళ్యెంకు చెందిన వెంకటాచలపతిని, చౌడేపల్లె మండలం ఎ.కొత్తకోట గ్రామానికి చెందిన షేక్ అజ్ముతుల్లాను, పుంగనూరు మండలం బండ్లపల్లెకి చెందిన శ్రీనివాసులురెడ్డిని పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. పేకాట , జూదం , అక్రమ మధ్యం వ్యాపారం, గంజాయి, కోడిపందెలపై సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు.
Tags: Three poker players arrested in Punganur -CI Raghavareddy
