విజయవాడ
విజయవాడముచ్చట్లు:

రాష్ట్రంలో శుక్రవారం ఉదయం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని కంభం రోడ్ లో బ్రహ్మంగారి గుడి వద్ద శివశక్తి ట్రాన్స్పోర్ట్ లారీ ఒక వ్యక్తి మీదకు ఎక్కియడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మీసాల మీరావలి (45) ఎస్ అర్ ఎం టీ లారి డ్రైవర్ కర్నూలు పట్టణవాసి.
మరో ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర జరిగింది. ఐజీ త్రివిక్రమ వర్మ క్యాంప్ క్లర్క్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. నిడుబ్రోలు, ఇంటూరు మద్య కారు కాలవలోకి దూసుకెళ్ళింది. కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు వారిలో ఇద్దరకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొన్నూరు లోని ప్రవేటు హాస్పటల్ కు తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పాలకొల్లు పట్టణానికి చెందిన బుద్ధ చంద్రావతి(80)గా గుర్తించారు. ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
tags;Three road accidents..Two died
