-పెద్దారవీడు మండలం కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం
-తల్లిదండ్రులకు మిగిల్చిన తీవ్ర శోభ
ప్రకాశం ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా,పెద్దారవీడు మండలం కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.పంట పొలానికి ఏర్పాటు చేసుకున్న నీటి కుంటలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్న సమయంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే ఆదివారం సెలవు దినం కావడంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ఆదివారం మధ్యాహ్నం కొంచెం తెరపించడంతో కొందరు విద్యార్థులు ఆటలాడుకుంటూ గ్రామ సమీపంలోని ఓరైతు ఏర్పాటు చేసుకున్న నీటి కుంట వద్దకు వెళ్లారు.ఈ ఘటనలో మృతి చెందిన కొత్తపల్లి శివ (11) మార్కాపురంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో 6వ తరగతి చదువుతున్నాడు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఆరవీటి ఏడుకొండలు (9), కొత్తపల్లి మను (9) మృతి చెందారు.మృతులలోని ఓ విద్యార్థి కాలుజారి నీట మునగడంతో ఆ విద్యార్థిని రక్షించతానికి మిగతా మృతులలోని విద్యార్థులు కూడా జారీ నీటి కుంటలో పడి మృతి చెందడం జరిగింది. మిగతా ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఈ విషయాన్ని సమీపంలోని గ్రామస్తులకు తెలపడంతో వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందిన విద్యార్థులను బయటకు తీయడం జరిగింది.అనంతరం మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలుపుగా చనిపోయిన విద్యార్థులను గ్రామంలోకి తీసుకురాగా ఆహాకారాలు మొదలయ్యాయి. విషయం తెలిసిన ప్రభుత్వ అధికారులు సబ్ కలెక్టర్ రెవెన్యూ పోలీసు అధికారులు నీటి కుంటను పరిశీలించడం జరిగింది. ఈ జరిగిన ఘటనపై పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఘటన స్థలానికి వస్తున్నారని తెలియ వచ్చింది.
Tags:Three students drowned