Three times tremulous land in Maharashtra

మహారాష్ట్రలోమూడు సార్లు కంపించన భూమి

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు

Date:14/12/2019

ముంబయి ముచ్చట్లు:

మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. దహను తాలుకాలోని దుండల్‌వాడి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ఆ గ్రామంలో భూమి కంపించిన మాట వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే స్పష్టం చేశారు. శనివారం తెల్లవారుజామున 5:22 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:26 గంటలకు తొలిసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు కాగా, శుక్రవారం రాత్రి 9:55 గంటలకు రెండోసారి భూమి కంపించింది. ఈ సమయంలో భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

 

సీబీఐ ద్వారా న్యాయం

 

Tags:Three times tremulous land in Maharashtra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *