ముగ్గురు సజీవ దహనం

చిత్తూరు ముచ్చట్లు:


చిత్తూరులోని ఓ పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో తండ్రీ కొడుకులు సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానిక రంగాచారి వీధిలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు భాస్కర్ (65)కు ఉన్న రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ఫ్లోర్లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. రెండో అంతస్తులో వారు ఉంటున్నారు. రాత్రి వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కిందనున్న పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు రెండో అంతస్తుకు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీబాబు (35), కుమారుడి స్నేహితుడు బాలాజీ (25) ప్రాణాలు కోల్పోయారు.
మంటలు చూసి అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే భవనాన్ని మంటలు చుట్టుముట్టేసాయి. మంటలను అదుపు చేసిన తర్వాత తలుపులు బద్దలుగొట్టిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి వున్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.

Tags: Three were burned alive

Leave A Reply

Your email address will not be published.