మూడేళ్ల తర్వాత మళ్లీ పడవ బోల్తా

Three years later the boat will roll again

Three years later the boat will roll again

Date:16/07/2018
కాకినాడ ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లో విషాదం నింపింది. ఈ ఘటనలో ఐదుగురు గల్లంతవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. మిగిలినవారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రమాదం జరగగానే స్థానికులు 26 మందిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. హోంమంత్రి చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌ గున్నీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. శనివారం  సాయంత్రం పశువుల్లంక నుంచి సలాదివారిపాలెంకు 31 మందితో బయల్దేరిన నాటు పడవ మొండిలంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గోదావరిలో వరద ప్రవాహం పెరగడం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వారంతా పదో తరగతి లోపువారేనని సమాచారం. గోదావరి పుష్కరాల్లో విషాదం చోటుచేసుకొని సరిగ్గా మూడేళ్లు పూర్తైన రోజునే ఈ విషాదం జరగడం గమనార్హం. 2015లో జులై 14న గోదావరి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి గోదావరి నదికి పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 27 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పుష్కరాలపై ప్రత్యేక వీడియో తీయడానికి భక్తులను చాలాసేపు ఆపి, ఒక్కసారిగా వదలడంతోనే ఈ విషాదం జరిందని నాడు ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ ఇదే తేదీన ( గోదావరిలో విషాదం చోటుచేసుకుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడవుల పెంపకానికి వనం-మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం రెండో శనివారం అయినప్పటికీ విద్యార్థులను పాఠశాలకు రప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరై పడవలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో విద్యార్థులు ప్రమాదం బారినపడ్డారు. ఓవైపు భారీ వర్షాలతో గోదావరిలో వరద పోటెత్తుతుండగా అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే అభంశుభం తెలియని చిన్నారులు ప్రమాదంలో పడ్డారని ప్రజలు మండిపడుతున్నారు.
మూడేళ్ల తర్వాత మళ్లీ పడవ బోల్తా https://www.telugumuchatlu.com/three-years-later-the-boat-will-roll-again/
Tags:Three years later the boat will roll again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *