రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
నిజామాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. కొండగట్టుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సుభాష్‌నగర్‌కు చెందిన ఉమ్మడి అశోక్, మంద మోహన్, రమేష్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Three youths died in a road accident

