ఉత్కంఠ భరితంగా ద్వితీయ లీగ్ మ్యాచ్ లు

తిరుపతి ముచ్చట్లు:
 
ఇందిరా మైదానంలో బుధవారం రాత్రి జరిగిన ద్వితీయ లీగ్ మ్యాచ్ లో ఉత్కంట భరితంగా సాగాయి. పురుషుల విభాగంలో జమ్మూ కాశ్మీర్ 46-37 పాయింట్లతో ఇండియన్ న్యావీ పై నెగ్గింది. నీలాగురై అకాడెమి 32 – 29 పాయింట్లతో హోన్నప్ప అకాడెమి పై, ఎస్ ఎస్ బి 51 – 35 తో ఈ ఎస్ ఐ సి జట్టు పై గెలిచింది.  మరో మ్యాచ్ లో మహారాష్ట్ర 59- 38 తో హైదరాబాద్ పై విజయం సాదించింది. ఉత్తమ క్రీడా కారులుగా ఆసిస్ (జమ్మూ & కాశ్మీర్ ), డి శక్తి దయా (నీలగిరి అకాడెమి), హావీద్ (ఎస్ ఎస్ బి ), మోనో (మహారాష్ట్ర) నిలిచి నిర్వాహకుల నుంచి రూ.5000/- నగదు బహుమతిని అందుకున్నారు.
మహిళా విభాగంలో  ఎస్ ఎస్ బి 62 – 20 పాయింట్ల తేడాతో పశ్చిమ బెంగాల్ పై , కర్నాటక 64-24 తో మహారాష్ట్ర జట్టు పై లీగ్ పోటీకి అర్హత పొందింది. హర్యానా 61 – 21 తో ఆంధ్ర ప్రదేశ్ బి జట్టుపై సునాయాసంగా నెగ్గింది. మైసూర్ 35 – 26 చెన్నబసవేశ్వర జట్టు పై విజయాన్ని నమోదు చేసింది. ఈ పోటీలలో ఉత్తమ క్రీడాకారులుగా ప్రియాంక ( ఎస్ ఎస్ బి ) , సోని (కర్నాటక ), సిమ్రాన్ (హర్యానా), పి ఆర్  ప్రీతి (మైసూర్) నిలిచి నిర్వాహకుల నుంచి రూ.5000/- నగదు బహుమతిని అందుకున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Thriller second league matches