The sinking intensity in the city has increased

The sinking intensity in the city has increased

Date:20/04/2018
పెద్దపల్లిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వడగాడ్పు తీవ్రత కూడా పెరుగుతుండడంతో జనాలు హడలిపోతున్నారు. అత్యవసరమైతే మినహా ఆరుబయట అడుగుపెట్టడంలేదు. ఇదిలాఉంటే పెద్దపల్లి జిల్లాలోనూ భానుడి ఎఫెక్ట్ అధికంగా ఉంది. జిల్లాలో సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడనే చెప్పొచ్చు. పెరుగుతున్న ఎండ తీవ్రత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిట్టమధ్యాహ్నం వేళ ఇళ్లనుంచి బయటకు వెళ్తే  వడగాలులు తప్పడం లేదు. ఇటీవలిగా అన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్లు 40డిగ్రీల సెల్సియస్‌ లు దాటిపోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే వాతావరణంలో వేడిమి పెరిగిపోతోంది. 10 గంటలకే ఉక్కపోత మొదలైపోతోంది. దీంతో కాస్త చల్లగా ఉన్నప్పుడే కార్యాలయాలు, ఇతర పనులు చక్కబెట్టుకునేందుకు ప్రజలు త్వరపడుతున్నారు. మధ్యాహ్నమైతే రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. అత్యవసరమైన పనులు ఉంటేనే జనాలు బయటకొస్తున్నారు.
ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏప్రిల్ లోనే ఈ తరహా ఎండ ఉంటే, ఇక మే నాటికి భీకరంగా ఉండొచ్చని భయపడుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది. బయటకొచ్చినవారు పండ్ల రసాలు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, చెరకు రసం లాంటి శీతలపానీయాలు సేవించేందుకు పోటీపడుతున్నారు. దీంతో ఆయా దుకాణాల నిర్వాహకులకు ఆదాయం పెరుగుతోంది. ఇదిలాఉంటే ఉష్ణోగ్రతలు నీటి లభ్యతను తీవ్రంగా  ప్రభావితం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తాగు-సాగు నీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో అయితే ప్రజలకు మంచి నీరు సరిగా అందడంలేదు. నీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తడం సమస్యాత్మకంగా మారింది. దీంతో నీటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మొత్తంగా పెరిగిపోతున్న ఎండలు జన జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Tags:Throwing sunny

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *