గన్నవరం ముచ్చట్లు:
విజయవాడ రూరల్ ఎనికెపాడులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు గూడవల్లి నరసింహారావు (నరసయ్య) ఇంటిపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఎనికేపాడులోని తన స్వంత స్థలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి నరసయ్య సహరించారు. శుక్రవారం సాయంత్రం అదే ప్రాంగణంలో జరిగిన గన్నవరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అర్థరాత్రి 3 గంటల సమయంలో బండ రాళ్లతో, ఇనుపరాడ్లతో అల్లరి మూకలు స్వైర విహారం చేసాయి. దుండగులు అద్దాలు, పలు వాహనాలను ధ్వంసం చేసారు.
Tags: Thugs attack TDP leader’s house