వరి కుప్పలకు నిప్పంటించిన దుండగులు

బాపులపాడు ముచ్చట్లు:
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది . అరుగాలం పండించి ధాన్యం నిల్వ ఉంచిన 6 వరి కుప్పలకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. దాసరి జోజీ అనే కౌలు రైతు కి చెందిన 6 వరి కుప్పులు దగ్ధం అయ్యాయి. జోజీ భార్య దూసరి నిర్మల  వీరవల్లి సెగ్మెంట్ -1 వైకాపా ఎంపిటిసి ఉన్నారు. 14 ఎకరాలు కౌలు తీసుకుని వరి పంట సాగు చేశారు. సుమారు 15లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చు చేశామని పూర్తి మంటల్లో కాలిపోయాయిని  చెబుతున్నారు. వీరవల్లీ పోలీసు స్టేషన్ సమాచారం అందించటంతో  ఎస్ ఐ సుబ్రహ్మణ్యం ప్రమాద స్ధలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు.. రాజకీయంగా , కుటుంబ పరంగా ఎవరితో ఏలాంటి విభేదాలు లేవని జోజి చెబుతున్నారు. బయట నుంచి డబ్బులు తీసుకువచ్చి  పెటుబడి పెట్టామని పూర్తిగా కాలిపోవటంతో  కన్నీరు పర్యంతమైయ్యారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు , గ్రామస్తులు పెద్ద ఎత్తున స్టేషన్ కి తరలివచ్చి రైతు జోజిని  పరామర్శిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Thugs set fire to rice piles

Natyam ad