త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
కాకినాడ ముచ్చట్లు:
కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో త్యాగరాజస్వామి ఒకరిని ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో ఆంధ్ర భద్రాద్రి శ్రీరామ నామ క్షేత్రం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాదోపాసన ద్వారా భగవంతున్ని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి అని అన్నారు. ఆయన శ్రీరామ భక్తామృతాన్ని సేవించి కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారని అన్నారు. ఆయన 24 వేల రచనలు, సుమారు 800 కీర్తనలు రచించారని అన్నారు. 1847 జనవరి 6న ఆయన మరణించడంతో స్మృతి దినోత్సవం గా జరుపుకుంటున్నామని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాజా, శిరీష, ఎం. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags: Thyagarajaswamy worship festival

