రేవంత్ రెడ్డి అనుచరుడికే టిక్కెట్

హైదరాబాద్  ముచ్చట్లు :
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, ఎంపీరేవంత్ రెడ్డి వర్గీయుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈయన మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత ముద్దసాని దామోదర్‌ రెడ్డి తనయుడు. ఈయన తాజాగా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ సమక్షంలో కశ్యప్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి వర్గీయుడు ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి మరణం తరువాత 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కశ్యప్‌ రెడ్డి తొలిసారిగా హుజూరాబాద్‌ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కశ్యప్‌ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. తరువాత ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నం చేసినా అది కుదరలేదు. దీంతో తాజాగా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఈయన్ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ప్రచారం జరుగుతోంది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Ticket for Rewanth Reddy follower

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *