Natyam ad

టిక్కెట్ల ధరలు పెంచాల్సిందే

విజయవాడ ముచ్చట్లు:
 
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా… మంగళవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిక్కెట్ల కమిటీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఫిల్మ్ గోయర్ సభ్యుడు రాకేష్ రెడ్డి ఇచ్చిన రిపోర్టును కమిటీ అభినందించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి రాకేష్‌రెడ్డి సమగ్రంగా నివేదిక తయారుచేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లతో థియేటర్ల నిర్వహణ చాలా కష్టమని ఓ ఎగ్జిబిటర్ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బి, సి సెంటర్లలో టిక్కెట్ ధరల్లో మార్పులు చేయాలని ఎగ్జిబిటర్లు సూచించారు.థియేటర్లలో వాటర్ బాటిళ్లను కూడా అనుమతించరని … వాటి గురించి మాత్రం ఎగ్జిబిటర్లు మాట్లాడరని ఈ సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు. అందులో కొంత వాస్తవం ఉందని ఫిల్మ్ ఛాంబర్ సభ్యుడు అంగీకరించారు. అయితే రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోవాలా అని సినీ గోయర్స్ సభ్యుడు ప్రశ్నించినట్లు సమాచారం. టిక్కెట్ రేట్లను నిర్ణయించే విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని అధికారులు వెల్లడించారు. హీరోల భారీ రెమ్యునరేషన్ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కొంతమంది హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే టికెట్ రేట్లు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని కొంత మంది కమిటీ సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Ticket prices have to go up