Natyam ad

టిడ్కో గృహాల నిర్మాణం ఒకడుగు ముందుకు

తిరుప‌తి‌ ముచ్చట్లు:


పేదల ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రారంభించిన టిడ్కో గృహాల నిర్మాణం ఒకడుగు ముందుకు… రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవడానికి నిధుల కొరత అడ్డంకిగా మారింది. ఈ ఏడాది లబ్ధిదారులకు టిడ్కో కొంత మేర నిర్మించిన గృహాలు సైతం పంపిణీకి సిద్ధంగా లేనట్లేననే తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 41 వేల 400 గృహాలు గ్రౌండింగ్‌ చేయగా… ఇప్పటి వరకు పూర్తయిన గృహాల సంఖ్య 79,184 మాత్రమే. 1,23,832 గృహాలకు సంబంధించి నేటికీ పునాది లెవెల్‌ (బేస్‌ మట్టం) స్థాయి దాటలేదు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. గ్రౌండింగ్‌ స్థాయిలో ఉన్న నిర్మాణాలు పూర్తి చేయాలంటే సుమారు రూ.13,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. నిధుల సర్దుబాటు లేకుండా నిర్మాణాలు ముందుకు సాగే అవకాశాలు కనబడటం లేదు. నిధుల లభ్యత కోసం గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వాటాను ఇన్‌స్టాల్‌మెంట్ల కింద జమ కావాల్సిన సుమారు రూ.4,212 కోట్లను రాబట్టేందుకు ప్రభుత్వం స్పెషల్‌ క్యాంపెయిన్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పూర్తయిన గృహాలకు సంబంధించి టిడ్కో చెల్లించాల్సిన బకాయిలు రూ.2 వేల కోట్లకు పైగా ఉన్నాయి.

 

 

 

నిర్మాణాలకు సరిపడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ నిధులు విడుదల చేస్తే 2022 జనవరి నాటికి గృహాల నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రేపోమాపో పూర్తయిన గృహాలను కేటాయిస్తే తమ సొంతింటి కల నెరవేరుతుందనే లబ్ధిదారుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.వైసిపి అధికారంలోకి వచ్చి 16 నెలలైనా లబ్ధిదారుల వాటా చెల్లించిన వారికి గతంలో కేటాయించిన గృహాలు అప్పజెబుతారా? లేదా? అనే అంశంపై ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత లబ్ధిదారులకే గృహాలు కేటాయిస్తామన్న స్పష్టత నివ్వలేదు. నవరత్నాల్లో పేదలకు పంపిణీ చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లోని స్థలాలను టిడ్కో గృహ లబ్ధిదారులకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. విజయవాడ నగరంలో టిడిపి హయాంలో ఇళ్ల మంజూరు పత్రం తీసుకున్న లబ్ధిదారులకు ఇంటి స్థలం కేటాయించినట్లు వాలంటీర్లు వేలిముద్రలు వేయించుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోంది.

 

Post Midle

Tags: Tidco housing construction is one step ahead

Post Midle