పేలుడుతో టిఫిన్ సెంటర్ ధ్వంసం

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖపట్నంలోని ఆటోనగర్లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద గురువారం ఉదయం పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడుతో టిఫిన్ సెంటర్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, జాగిలాలు, బాంబు స్క్వాడ్తో ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించినా.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేరే కారణంవుందని  పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Tags: Tiffin Center destroyed by explosion

Leave A Reply

Your email address will not be published.