పులి వేటగాళ్లు ఆరెస్టు

Date:15/04/2019

హైదరాబాద్ ముచ్చట్లు :
పులులను సంహరించి దాని చర్మాన్ని, గోళ్లను అక్రమంగా స్మగుల్ చేస్తున్న నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు   అరెస్ట్ చేసారు. ఈ కేసు వివరాలు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. దేశంలో అంతరించిపోతున్న పులుల దృష్టిలో పెట్టుకుని వాటిని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎంత కృషి చేసినా కొంతమంది స్మగ్లర్లు డబ్బులకోసం పులులను సంహరించి వాటి చర్మాన్ని ,గోళ్లను సుమారు 5 లక్షల రూపాయలకు వాటిని అమ్ముతున్నారని అయన  తెలిపారు.     ఎల్బీ నగర్ పోలీసులకు అందిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసుల సహాయంతో ఈ నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి వారి వద్దనుండి పులి చర్మాన్ని, నాలుగు గోళ్లను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా , ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈ నలుగురు ఒడిశా రాష్ట్రంలోని అడవుల్లో తిరుగుతున్న పులిని చంపి దాని చర్మాన్ని హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చిన్నట్లు సమాచారంతో ఎస్వోటి పోలీసులు చర్మాన్ని కొనేవారి లాగా స్మగ్లర్లతో బేరం చేసి వారి వద్ద ఉన్న చర్మాన్ని , గోళ్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ అపరేషన్లో పాల్గొన్న పోలీసులకు క్యాష్ ప్రైజ్ అందజేస్తామని మహేష్ భగవత్ తెలియజేసారు.
Tags:Tiger hunters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *