ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిసరాల్లో పులి సంచారం…పశువుల పై దాడి

-భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు

Date:29/10/2020

మంచిర్యాల  ముచ్చట్లు:

మంచిర్యాల జిల్లా హజీపూర్ మండల పరిధి లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ను ఆనుకుని ఉన్న పంటపొలాల్లో పులి సంచరిస్తోంది.  గత రెండు రోజుల నుండి పెద్దపులి ఈ ప్రాంతాల్లో సంచరిస్తుండటం తో సమీప గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు.  స్థానిక రైతులు పులి సంచారం పై ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీనితో ఫారెస్ట్ అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిసర ప్రాంత నాంనూర్, గుడిపేట్ నర్సింగపూర్ గ్రామాల్లో పర్యటించి పంట పొలాల్లో పులి అడుగులు గుర్తించి, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పులి ఈ ప్రాంతంలో పశువుల పై దాడి చేసిందని రైతులు తెలిపారు. ఇన్నాళ్లు హాజీపూర్ మండలంలోని ధర్మారం, బుగ్గగట్టు, గుడిపేట గ్రామ శివారు ల్లోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి అడుగుజాడ లు కనిపించడం, ఆవులు, బర్రెలు, పులి దాడిలో మరణించడం వంటి వాటిపై అటవీ శాఖా అధికారులు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఏకంగా నర్సింగాపూర్ గ్రామ శివారులోని ఎల్లం పల్లి ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించాయి. అంతే కాదు గ్రామానికి చెందిన నల్ల అంజన్న అనే వ్యక్తి కి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పులిని ప్రత్యక్షం గా చూసి భయాందోళలనకు గురైన గ్రామంలోకి పరుగెత్తుకు వచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చాడు.   ఈ విషయ అటవీ అధికారులకు  తెలియజేయడంతో వారు పులి అడుగులు గుర్తిం చారు. గ్రామస్తులు అడవిలోకి వెళ్లవద్దని గ్రామం లో చాటింపు వేయించారు . పశువులను సైతం మేతకు అటవీ ప్రాంతానికి వెళ్లనివ్వొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు .

శరవేగంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్”

Tags: Tiger roaming around Ellampalli project … Attack on cattle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *